మాది కోరుట్ల మండలం వాల్గొండ గ్రామం. బీడీలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. పీఎఫ్ ఉన్నా మాకు జీవనభృతి రావడం లేదు. బీడీలు చేయని వారు భృతి పొందుతున్నారు. పీఎఫ్ ఉన్న మాకు భృతి ఇప్పించండి. – వాల్గొండ బీడీ కార్మికులు
ప్లాస్టిక్ నిషేధించండి
గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడండి. 12ఏళ్లకోసారి జరిగే పుష్కరాలకు ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. హోటళ్లు, దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగించకుండా ఆంక్షలు విధించండి.
– నాగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది
ఫొటో క్యాప్చర్ చేయడం లేదు
మాది పెగడపల్లి మండలం ల్యాగలమర్రి. ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పిల్లర్ల దశకు చేరినా ఫొటో క్యాప్చర్ చేయడం లేదు. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించగా ఆ ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా తహసీల్దార్, సర్పంచు కుమ్మకై ్క వాస్తవాలను తొక్కి పెడుతూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – కల్లెపెల్లి భాగ్యమ్మ


