జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 10,860 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈనెల 30 నాటికి పనులు ప్రారంభించాలని సూచించారు. 100 శాతం గ్రౌండింగ్ చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. జూన్ రెండు నాటికి గృహ ప్రవేశాలు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, కమిషనర్లు పాల్గొన్నారు.


