ఆలకించి.. ఆదేశించి.. | - | Sakshi
Sakshi News home page

ఆలకించి.. ఆదేశించి..

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ● పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 63అర్జీలు రాగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్‌.లత, రాజాగౌడ్‌, ఆర్డీవోలు పాల్గొన్నారు.

భూమిని ఆక్రమించారు

గ్రామ శివారులోని సర్వేనంబర్‌ 678లోని 2.5 ఎకరాల భూమి ఉంది. 60ఏళ్ల క్రితం కొనుక్కుని సాగుచేసుకుంటున్నాం. ప్రస్తుతం ఆ భూమిని పోరంబోకు భూమి అంటూ మాజీ సర్పంచ్‌, అధికారులు కుమ్మకై ్క రైతువేదిక నిర్మించారు. నా భూమి నుంచే దుర్గాదేవి గుడికి దారి వేస్తున్నారు. ఆ భూమి తప్ప మా కుటుంబానికి వేరే ఆధారం లేదు. గత వారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన. న్యాయం చేసి ఆదుకోండి.

– వంగ ముత్తవ్వ, మైతాపూర్‌, రాయికల్‌

కరెంట్‌ మీటర్‌ ఇప్పించండి

‘మా ఇంటి కరెంట్‌ మీటర్‌ను ఏఈ తీసుకెళ్లాడు. చీకట్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్‌ అదికారులను కలిసినా పట్టించుకోవడం లేదు’ అంటూ పెట్రోల్‌ బాటిల్‌తో రాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్‌ను కలిసి తన సమస్యపై వినతిపత్రం అందించింది.

– గుగులోతు లక్ష్మీ, వేములకుర్తి

Advertisement
 
Advertisement
Advertisement