హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

జగిత్యాల: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. వైద్యాధికారులతో సోమవారం సమీక్షించారు. బాలి కల ఆరోగ్య పరిరక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 15ఏళ్లు చేరిన బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. 2170 వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 769 వ్యాక్సిన్లు వేశామని తెలిపారు. డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి, ఆర్‌ఎంవో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి

గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్‌ అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణపక్షం పోస్టర్‌ను ఆవిష్కరించారు. చిన్నారుల అభివృద్ధిపై తల్లి దండ్రుల బాధ్యత అంశంపై అవగాహన కల్పించా లన్నారు. డీడబ్ల్యూవో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన

ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని కలెక్టర్‌ అభినందించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో అత్యధిక మార్కలు సాధించగా నోడల్‌ అధికారి నారాయణతో కలిసి అభినందించారు.

ముగిసిన ‘పది’ పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, శాఖాధికారులు, సిట్టింగ్‌ స్క్వాడ్‌, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఆయన వెంట డీఈవో రాము ఉన్నారు. మొత్తం 68 సెంటర్లలో 12,694 విద్యార్థులకు 12,685 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement