రెండు ఆలయాల్లో దొంగతనం | - | Sakshi
Sakshi News home page

రెండు ఆలయాల్లో దొంగతనం

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

కథలాపూర్‌: మండలంలోని భూషణరావుపేటలోగల రామాల యం, మల్లికార్జునస్వామి ఆలయాల్లో గుర్తు తెలియ ని దుండగులు చొరబడ్డారు. హుండీలను ధ్వంసం చేసి అందులో ని డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. హుండీల్లో సుమారు రూ.25 వేలు ఉంటాయని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు.

మత పరిమితులు సరికాదు

కొడిమ్యాల: ఎస్సీ రిజర్వేషన్‌ను మతంతో అనుసంధానం చేయడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని మానవ హక్కుల నేర నిరోధక సంఘం జిల్లా అధ్యక్షుడు పర్లపల్లి ఏలియా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడారు. సామాజిక వెనుకబాటుతనాన్ని ఆధారంగా తీసుకుని అందరికీ సమానంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement