జగిత్యాలలో నాలుగు పదవులు.. 11 మంది దరఖాస్తు మెట్‌పల్లిలో తటస్థంగా ఉండాలని బీఆర్‌ఎస్ నిర్ణయం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు
పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినా వ్యూహాత్మకంగా వ్యవహరించి చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను ‘చే’జిక్కించుకున్న కాంగ్రెస్.. కో–ఆప్షన్ పదవులన్నింటినీ హస్తగతం చేసుకునేలా పావులు కదుపుతోంది.
నలుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను ఆ పార్టీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే వ్యూహంతో నాలుగు కోఆప్షన్ పదవులను కూడా కై వసం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు
గట్టి పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు గతంలో లేని విధంగా ఈసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొందరు అభ్యర్థులు.. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తానికి తీవ్రమైన పోటీ నేపథ్యంలో ‘ఆ నలుగురు’ ఎవరు అవుతారన్నది మాత్రం ఉత్కంఠ నెలకొంది.
కోఆప్షన్ పదవి కోసం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కొందరి పేర్లను అధిష్టానానికి పంపించారు. మరికొందరు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వద్దకు వెళ్లారు. ఇంకొందరి పేర్లను డీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎవరికివారుగా తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు.
ఈనెల 16లోపు ఎన్నిక
జగిత్యాల బల్దియాలో 11 దరఖాస్తులు రాగా.. స్క్రూటిని చేసి నోటిఫికేషన్ జారీ చేస్తారు. 16, 17 తేదీల్లో వీరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. జనరల్‌లో ఇంతకుపూర్వం కౌన్సిలర్‌గా చేసి ఉండాలి. స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌కై నా అవకాశం ఉంటుంది. మైనార్టీల్లో 21 ఏళ్లు ఉండి, ఓటరు రిజిస్టర్ అయితే సరిపోతుంది.
ఆశావహుల్లో ఆందోళన
గతంలో కౌన్సిలర్ టికెట్‌కు పోటీపడగా ఓడిపోయినవారు.. టికెట్ రాక పక్కకు తప్పుకొన్నవారికి కో–ఆప్షన్ పదవి ఇస్తామని ఆ సమయంలో అధిష్ఠానం బుజ్జగించింది. ప్రస్తుతం వారి పేర్లు కాకుండా ఇతరుల పేర్లు తెరపైకి వస్తుండడంతో కంగుతింటున్నారు. ఇందులో మొదటి నుంచి కాంగ్రెస్‌లో లేనివారికే అవకాశాలు ఇస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేకే పూర్తి నిర్ణయాధికారం లభించినట్లయ్యింది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి జెండా మోసిన తమకు అవకాశం వస్తుందో.. రాదోనని ఆందోళన చెందుతున్నారు.
మెట్‌పల్లిలో నాలుగు పదవులు.. ఇరవై నాలుగు దరఖాస్తులు
మెట్‌పల్లిలో మొత్తం నాలుగు పదవులు ఉండగా.. ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద సంఖ్యలో ఆశావహులు బరిలో నిలిచారు. బల్దియాలో ఏ పార్టీకీ మెజార్టీ లేకపోవడం కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోటీకి దూరంగా బీఆర్‌ఎస్
రెండువర్గాలుగా బీజేపీ కౌన్సిలర్లు
జగిత్యాల/మెట్‌పల్లి: కో–ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల బల్దియాలో నాలుగు పదవులకు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఎమ్మెల్యే, మంత్రి చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఇటీవల కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయిన వారు, టికెట్ ఇవ్వకపోవడంతో తప్పుకొన్నవారు ఉన్నారు. జగిత్యాలలో నాలుగింట్లో రెండు జనరల్, రెండు మైనార్టీలకు అవకాశం దక్కనుంది. రెండు పదవులు మహిళలకు కేటాయించనున్నారు. జనరల్ నుంచి గట్టు సతీశ్, మహిళ కోటాలో జుంబర్తి లక్ష్మీ పోటీపడుతున్నారు. మైనార్టీ కోటాలో అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మహిళ కోటలో తస్లీమా సుల్తానా పదవి కోరుతున్నారు.


