దోస్త్‌ పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

దోస్త్‌ పిలుస్తోంది

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

దోస్త్‌ 2026– 27 ముఖ్య తేదీలు

రెండో దశ రిజిస్ట్రేషన్లు

మూడో దశ రిజిస్ట్రేషన్‌

కరీంనగర్‌ సిటీ: డిగ్రీలో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి సోమవారం దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ ఒకటవ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. దీంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థుల సమాచారం సేకరించి, మా కాలేజీలో చేరండంటూ పీఆర్వోల ద్వారా ఫోన్లు చేస్తున్నారు. ప్రత్యేక రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తున్నారు. ఆయా కళాశాలల లెక్చరర్లకు టార్గెట్లు విధించి, ప్రత్యేక వాహనాలు కేటాయిస్తూ ఆడ్మిషన్ల కోసం క్యాంపెయినింగ్‌ చేయిస్తున్నారు.

రంగంలోకి పీఆర్వోలు, లెక్చరర్లు

ప్రతీ కళాశాల యాజమాన్యం విద్యార్థులను చేర్పించుకునేందుకు పీఆర్వోలను నియమించుకున్నాయి. వీరితో పాటు అధ్యాపకులు సైతం గ్రామాలు, మండలాలు, పట్టణాల వారీగా ఇంటర్‌ పూర్తిచేసిన వారి వివరాలు సేకరించి, అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో టచ్‌లోకి వెళ్తున్నారు. విద్యార్థులను చేర్పించినందుకు పీఆర్వోలకు, లెక్చరర్లకు ఒక్కో అడ్మిషన్‌కు రూ.6వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. డిగ్రీ ప్రవేశాలు ఎంతో పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో దోస్త్‌ను తీసుకురాగా ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ అడ్డదారిలో ప్రవేశాలు పొందడానికి పలు ప్రైవేట్‌ కళాశాలలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

విద్యా ప్రమాణాలే ముఖ్యం

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొత్తం 93 కాలేజీలున్నాయి. వీటితో ఉన్నత విద్యాప్రమాణాలు పాటించే కాలేజీలను ఎంచుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఆఫర్లకు ఆశపడి నాణ్యత పాటించని, వ్యాపార దృక్పథంతో నడిచే కాలేజీల్లో చేరి భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. కళాశాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని, ఒకసారి సందర్శించి, అక్కడున్న సౌకర్యాలు పరిశీలించిన తర్వాతనే చేరాలని చెబుతున్నారు. అందులో చదువుతున్న సీనియర్లను సంప్రందించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో తెలుసుకోవాలని చెబుతున్నారు.

నోటిఫికేషన్‌ జారీ ఏప్రిల్‌ 13

మొదటి దశ రిజిస్ట్రేషన్లు

ఏప్రిల్‌ 15 నుంచి మే 7 వరకు

(రిజిస్టేషన్‌ రుసుం రూ.200)

వెబ్‌ ఆప్షన్‌ నమోదు

ఏప్రిల్‌ 30 నుంచి మే 08 వరకు

మే 14న సీట్ల కేటాయింపు

విద్యార్థులు చేరు సమయం

మే 15వ తేదీ నుంచి మే 25 వరకు

మే 15 నుంచి మే 25 వరకు

(రిజిస్ట్రేషన్‌ రుసుం రూ. 400)

వెబ్‌ ఆప్షన్‌ నమోదు

మే 15 నుంచి మే 26 వరకు

మే 30న రెండో దశ సీట్ల కేటాయింపు

విద్యార్థులు చేరు సమయం

మే 31వ తేదీ నుంచి జూన్‌ 5 లోపు

మే 31 నుంచి జూన్‌ 15 వరకు

(రిజిస్ట్రేషన్‌ రుసుం రూ. 400)

వెబ్‌ ఆప్షన్‌ నమోదు

మే 31 నుంచి జూన్‌ 16 వరకు

జూన్‌ 20న సీట్ల కేటాయింపు

విద్యార్థులు చేరు సమయం

జూన్‌ 20 నుంచి జూన్‌ 25లోపు

మొదటి సెమిస్టర్‌ తరగతులు

జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం

సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం

విద్యార్థుల వేటలో ప్రైవేటు పీఆర్వోలు

శాతవాహన యూనివర్సిటీ

పరిధిలో కళాశాలలు

ప్రభుత్వ 15

ఎయిడెడ్‌ 02

ప్రైవేట్‌ 76

మొత్తం 93

Advertisement
 
Advertisement
Advertisement