● చైర్మన్‌గా కట్కం రవీందర్● వైస్ చైర్‌పర్సన్‌గా తురగ
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. చైర్మన్‌గా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కట్కం రవీందర్, వైస్ చైర్‌పర్సన్‌గా తురగ సౌజన్య ఎన్నికయ్యారు. బల్దియా కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ పదవి జనరల్ కావడంతో కట్కం రవిని తురగ సౌజన్య ప్రతిపాదించారు. ఎలిగేటి లతిక బలపర్చారు. బీజేపీ నుంచి ధర్మపురిని చైర్మన్ అభ్యర్థిగా కూనారపు మానస ప్రతిపాదించగా.. తోపారపు ప్రశాంతి బలపర్చారు. రవికి కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు, స్వతంత్రుడొకరు చేతులు లేపడంతో చైర్మన్‌గా ప్రకటించారు. తురగ సౌజన్యను ఎలిగేటి లతిక ప్రతిపాదించగా.. కట్కం రవీందర్ బలపర్చారు. బీజేపీ నుంచి పుర్రె శ్రీధర్‌ను ప్రశాంతి ప్రతిపాదించగా మౌనిక బలపర్చారు. సౌజన్యకు బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ చేతులు లేపడంతో వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై నట్లు నియమక పత్రాలు అందించారు. మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సుధీర్‌రావు బందోబస్తు చేపట్టారు.
విప్ జారీ చేయని కాంగ్రెస్
చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయలేదు. బల్దియాలో మొత్తం 12 స్థానాలకు కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఐదుగురు, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. బీజేపీ, బీఆర్‌ఎస్ విప్ జారీ చేసినా.. అధికార కాంగ్రెస్ జారీ చేయకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు.
● చైర్మన్‌గా కట్కం రవీందర్● వైస్ చైర్‌పర్సన్‌గా తురగ
● చైర్మన్‌గా కట్కం రవీందర్● వైస్ చైర్‌పర్సన్‌గా తురగ


