● పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ● ఎమ్మెల్యే సహకారంతో ముందుకు ● జగిత్యాల చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి | - | Sakshi
Sakshi News home page

● పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ● ఎమ్మెల్యే సహకారంతో ముందుకు ● జగిత్యాల చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి

Feb 17 2026 8:13 AM | Updated on Feb 17 2026 8:13 AM

● పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ● ఎమ్మెల్యే సహకారంతో ముం

● పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ● ఎమ్మెల్యే సహకారంతో ముం

● పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ● ఎమ్మెల్యే సహకారంతో ముందుకు ● జగిత్యాల చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి

అభివృద్ధికి కృషి

జగిత్యాల: ‘నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చిన పట్టణ ప్రజలకు అభినందనలు.. పట్టణాభివృద్ధికి కృషి చేస్తా.. మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా..’ అన్నారు నూతనంగా ఎన్నికై న జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి. సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

అభివృద్ధి విషయంలో..

జగిత్యాల అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తాను. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తా. ఈ అవకాశం రావడం అదృష్టం. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. అభివృద్ధికి తప్పకుండా ప్రయత్నం చేస్తా. జగిత్యాలలో ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చైర్‌పర్సన్‌గా ముందుండి ఆ పనులన్నీ ముందుకు నడిపిస్తా. ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా ఉండేలా కృషి చేస్తా.

ప్రొఫైల్‌

పేరు : సమిండ్ల వాణి

భర్త : సమిండ్ల శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌

రాజకీయ నేపథ్యం: భర్త శ్రీనివాస్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడిగా పేరొందిన వ్యక్తి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 2005లో కౌన్సిలర్‌గా కొనసాగారు. 2019లో వాణి కౌన్సిలర్‌గా గెలుపొందారు.

వృత్తి : హౌస్‌వైఫ్‌

చదువు : డిగ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement