కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
రాయికల్: కౌన్సిలర్ల ప్రమాణస్వీకారానికి రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పెషల్ ఆఫీసర్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి తెలిపారు. బల్దియాలోని 12మంది కౌన్సిలర్లతో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తామని, 12.30గంటలకు చైర్మన్ ఎన్నిక, తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. కోరం ఉంటేనే ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామని, లేనిపక్షంలో మరో రోజుకు వాయిదా వేస్తామని వివరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, తదితరులు ఉన్నారు.
కొండగట్టులో కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ పూజలు
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి, కో–ఆపరేటివ్ సొసైటీ ట్రిబ్యునల్ చైర్మన్ పి.నారాయణబాబు ఆదివారం కుటుంబ సమేతంగా పూజలు చేశారు. సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు సునీల్‌కుమార్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
రాయికల్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు జారీ చేసే విప్ ధిక్కరిస్తే సభ్యులపై అనర్హత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విప్‌కు వ్యతిరేకంగా వేసిన ఓటు చెల్లుబాటు అవుతుంది. విప్ మూడు రోజులలోపు కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి. కలెక్టర్ ఏడు రోజుల్లోపు షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. విచారణ అనంతరం సంతృప్తికరమైన వివరాలు లేకపోతే కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో సభ్యత్వం రద్దవుతుంది.
కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు


