లోక్ అదాలత్‌లో 2010 కేసులు పరిష్కారం
జంటలను అభినందిస్తున్న
న్యాయమూర్తులు
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సి.రత్నపద్మావతి
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఆదివారం జరిగిన లోక్ అదాలత్‌లో 2010 సివిల్, క్రిమినల్, మోటర్‌వాహనాల పరిహారం కేసులు పరిష్కారం అయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లాజడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారు తి, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
ఏకమైన రెండు జంటలు
మెట్‌పల్లి: కాపురంలో ఏర్పడిన కలహాలతో దూరంగా ఉంటున్న రెండు జంటలు లోక్ అదాలత్‌లో ఏకమయ్యాయి. కోరుట్లకు చెందిన త్రివేణికి యూసుఫ్‌నగర్‌కు చెందిన పులి దివాకర్‌తో వివాహమైంది. మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన కీర్తనకు రుద్రంగి మండలం మానాలకు చెందిన పులి దివాకర్‌తో వివాహమైంది. వీరికి ఒక పాప. అదనపు కట్నం కోసం దివాకర్ వేధిస్తున్నాడని కీర్తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతోంది. లోక్ అదాలత్‌లో ఈ రెండు జంటలకు మేజిస్ట్రేట్‌లు నాగేశ్వర్‌రావు, అరుణ్‌కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. న్యాయవాదుల సమక్షంలో కేసులను ఉపసంహరించుకుని ఏకమయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.
జడ్జమ్మా.. నా కేసును పరిష్కరించమ్మా..
‘జడ్జమ్మా.. నా కేసును పరిష్కరించమ్మా..’ అంటూ ఓ వృద్ధురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతిని వేడుకుంది. జిల్లా కోర్టులో ఆదివారం లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరిస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాలరూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు వచ్చింది. తాను చాలా ఏళ్ల క్రితం కోర్టులో కేసు వేశానని, ఇప్పటికి పరిష్కారం కాలేదని, పరిష్కరించాలని కోరింది. న్యాయమూర్తి స్పందించి కేసు పూర్తి వివరాలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
లోక్ అదాలత్‌లో 2010 కేసులు పరిష్కారం


