సమాజహితమే అందరి లక్ష్యం కావాలి
కోరుట్ల: సమాజహితమే అందరి లక్ష్యం కావాలని కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత కవి జయరాజ్ అన్నారు. ఆదివారం ఆయన కోరుట్లలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయనిజం అంటేనే సేవ అని గుర్తు చేశారు. ప్రకృతి ఒడిలో సేదదీరడంతో పాటు ప్రకృతికి హాని చేయకుండా మనుగడ సాగిస్తేనే మనిషి సదీర్ఘ ప్రయాణం కొనసాగుతుందన్నారు. రీజనల్ మీట్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన గుంటుక సురేష్‌బాబు, ప్రసన్న రాణి దంపతులు హానికారకమైన ప్లాస్టిక్‌ను సమాజానికి దూరం చేసే క్రమంలో ఆహూతులందరికీ స్టీల్ బాటిల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను స్టీల్ ప్లేట్ అందిస్తామని చెప్పి తమ లయనిజాన్ని చాటుకున్నారన్నారు. ప్రజాకవి జయరాజ్ తాను రాసిన పాటల్లోని ‘వందనాలమ్మా..తల్లీ వందనాలమ్మా’ను పాడటంతో సభికులు బావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ఎల్‌ఎన్ నాదిపెల్లి వెంకటేశ్వర్రావు, పీఎంజేఎఫ్ లయన్ మోర బద్రేశం, పీఎంజేఎఫ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటుక చంద్రప్రకాశ్, లయన్ అనంతుల శివప్రసాద్, కార్యదర్శి సింగిరెడ్డి వాసుదేవ రెడ్డి, ట్రెజరర్ వెంకట్, సెక్రటరీ మధు, కో–ఆర్డినేటర్ పోతని ప్రవీన్‌కుమార్, లయన్స్ గండ్ర అజేందర్‌రావు, ప్రకాశ్‌కల్వార్, అల్లాడి ప్రవీన్, చాప కిషోర్, ఉషాకిరన్, మంచాల జగన్, మహేందర్, అన్నం అనిల్, లయన్ మీట్ ట్రెజరర్ కొమ్ముల జలపతిరెడ్డి పాల్గొన్నారు.
కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత, కవి జయరాజ్


