వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్‌లోని బిర్లా ఓపెన్‌మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్‌లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు.


