15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన 15ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతుండగా సోమాజిగూడ యశో ద హాస్పిటల్స్‌లో అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్‌కుమార్ తెలిపారు. ప్రస్తు తం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. గురువారం కరీంనగ ర్ యశోద మెడికల్ సెంటర్‌లో మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్‌లోని హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌లో లుకేమి యా, లింఫోమాస్, మల్టీపుల్ మైలో మా, అప్లాస్టిక్ అనీమియా, తలసే మియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.


