పూత ఇంకా రాలేదు
మామిడి తోటలో ఇంకా పూత రాలేదు. పూత వస్తుందనే ఆలోచనలతో తోటలో ఇప్పటికే ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చు పెట్టి.. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాను. పురుగుమందులు కూడా పిచికారీ చేయించాను. మూడేళ్లుగా పూత లేదు. ఈ సారి ఏమి చేస్తుందో చూడాలి.
– సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్(మం)
గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం మామిడి పూతపై ప్రభావాన్ని చూపుతాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పూత వచ్చే అవకాశం ఉంది. పూత సమయంలో తోటలో ఎలాంటి పనులు చేయవద్దు.
– శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి
పూత ఇంకా రాలేదు


