60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్‌గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్‌గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్
ఉద్యమస్ఫూర్తితో..
1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్‌వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
– వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి
60 ఏళ్ల ప్రాక్టీస్


