సిల్ట్ తీయరు..
మల్యాల: ముత్యంపేటలోని శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి వారిని ఆదివారం వేలాది మంది దర్శించుకున్నారు. సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఓంకారం ఆకారంలో దీపాలు వెలిగించి, దీపారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు ఉమామహేశ్వర రావు, అర్చకులు పాల్గొన్నారు.
కమనీయం.. వెంకన్న కల్యాణం
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం వెంకటాపూర్ గుట్ట వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకన్నస్వామి కల్యాణాన్ని ఆదివారం కనులపర్వంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
● ఇది జిల్లాకేంద్రంలోనే ప్రధానమైన రోడ్డు. ఇక్కడ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. సమీపంలో కనీసం డ్రైనేజీ కూడా లేదు. దీంతో మురికినీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. చెత్తాచెదారం రోడ్డుపైకి వస్తోంది. అధికారులు డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
							సిల్ట్ తీయరు..
							సిల్ట్ తీయరు..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
