పోలీసుల విస్తృత తనిఖీలు
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్రధాన చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేశారు. హోటళ్లు, లాడ్జీల్లో రికార్డులు పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేశారు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగ్గా సీసీ కెమెరాలు పెట్టాలని, ఆధార్‌కార్డు వంటి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని సీఐ సూచించారు. ఎస్సైలు సుప్రియ, రవికిరణ్, కుమార స్వామి, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 16 గేట్లను ఎత్తి 47,059 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 56,513 క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా బయటకు విడుదల చేస్తున్నారు.
అక్రమంగా మట్టి తరలింపు
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం నర్సింగాపూర్ శివారు రెవెన్యూ భూముల నుంచి రాత్రివేళల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. సెలవుదినాలు చూసి పెద్దఎత్తున టిప్పర్లు, పొక్లెయిన్ల సహాయంతో మట్టిని జగిత్యాల, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ రవాణాపై స్థానికులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కొండగట్టు ఆలయానికి నిరంతర విద్యుత్
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి వారి ఆలయానికి విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ రూ.10లక్షలతో కొత్త లైన్ ఏర్పాటు చేసింది. మెట్లదారి వెంట, చెట్ల మధ్య నుంచి ఇనుప స్తంభాల ద్వారా ఆలయానికి దశాబ్దాలుగా విద్యుత్ సరఫరా అవుతోంది. వర్షాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతోంది. మరమ్మతు చేపట్టేందుకు కష్టతరంగా మారడంతో ఘాట్ రోడ్డు వెంట 38విద్యుత్ స్తంభాలు వేశామని రామన్నపేట సెక్షన్ ఏఈ ఆకునూరి శ్రీనివాస్ తెలిపారు.
కనకదుర్గ ఆలయంలో కార్తీకదీపోత్సవం
మల్లాపూర్: మండలకేంద్రంలోని శ్రీకనకదుర్గాదేవి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష కార్తీకదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ క్యాతం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు తోట రవీందర్, నాంపల్లి మారుతి, కై ర రామాగౌడ్, పోలాస రాజయ్యచారిలు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు బల్యపెల్లి కృష్ణప్రసాద్‌శర్మ అమ్మవారికి పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
							పోలీసుల విస్తృత తనిఖీలు
							పోలీసుల విస్తృత తనిఖీలు
							పోలీసుల విస్తృత తనిఖీలు
							పోలీసుల విస్తృత తనిఖీలు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
