కూటమిదే ‘అర్బన్‌’ పీఠం | - | Sakshi
Sakshi News home page

కూటమిదే ‘అర్బన్‌’ పీఠం

Nov 3 2025 6:26 AM | Updated on Nov 3 2025 6:26 AM

కూటమి

కూటమిదే ‘అర్బన్‌’ పీఠం

కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో కర్ర రాజశేఖర్‌ ప్యానెల్‌ విజయం మహిళా డైరెక్టర్లకు పోటాపోటీ.. పట్టణంలోనూ చెల్లని ఓట్లు వరాల జ్యోతికి అత్యధిక ఓటర్ల మద్దతు

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో కర్ర రాజశేఖర్‌ ప్యానెల్‌ విజయదుందుబి మోగించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఓట్ల లెక్కింపులో అధిక్యం మారుతూ, చివరికి కూటమినే భారీ విజయం వరించింది. రెండు డైరెక్టర్‌ పోస్టులు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు వర్గం నిర్మల భరోసా ప్యానెల్‌ గెలుచుకుంది. పారదర్శక పాలన పేరుతో బరిలో నిలిచిన గడ్డం విలాస్‌రెడ్డి ప్యానెల్‌లో ఒక్కరూ గెలవకపోగా విలాస్‌రెడ్డి కూడా ఓటమిపాలయ్యారు.

12గంటల పాటు కౌంటింగ్‌

ఏడు గంటల పాటు పోలింగ్‌ జరగగా ఓట్ల లెక్కింపు 12గంటల పాటు సాగింది. శనివారం సాయంత్రం 4గంటలకే కౌంటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా 4గంటలకు పైగా ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడవుతాయని అధికార యంత్రాంగం భావించినప్పటికి ఆదివారం ఉదయం 8గంటల వరకు కౌంటింగ్‌ సాగింది. తొలుత రెండు మహిళా డైరెక్టర్‌ స్థానాలకు, తదుపరి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఓట్లు, అనంతరం జనరల్‌ కేటగిరీ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు.

పోలైన ఓట్లలో 37.53శాతం చెల్లని ఓట్లు

అర్బన్‌ బ్యాంకులో మొత్తం ఓటర్లు 9,287 మంది కాగా పోలైంది 4,114 ఓట్లు మాత్రమే. నమోదైన పోలింగ్‌శాతం 44.29 కాగా వివిధ కేటగిరీలు కలిపి చెల్లని ఓట్లు 37.53శాతం నమోదయ్యాయి.

వెలిచాల డీలా.. విలాస్‌కు జీరో

ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగగా కూటమి ప్యానెల్‌ కర్ర రాజశేఖర్‌ వర్గమే పైచేయి సాధించింది. వెలిచాల వర్గం నిర్మల భరోసా ప్యానెల్‌లో జనరల్‌ కేటగిరిలో అనురాసు కుమార్‌, ఉయ్యాల ఆనందం విజయం సాధించారు. మహిళా కేటగిరిలో మునిపల్లి ఫణీత కాస్త పోటీ ఇచ్చినా వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. మూల వెంకటరవీందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. గడ్డం విలాస్‌రెడ్డివర్గంలో ఒక్కరూ గెలువలేదు. విలాస్‌రెడ్డికి 583 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

వరాల జ్యోతికి అఽత్యధిక ఓట్లు

మొత్తంగా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిగా వరాల జ్యోతి నిలిచారు. 2,119 ఓట్లు సాధించగా, 55.47శాతం ఓటర్ల మద్దతు లభించింది. తరువాత స్థానంలో కర్ర రాజశేఖర్‌ 19,59 ఓట్లతో 52.12శాతం మద్దతు లభించగా మూడో స్థానంలో ముద్దసాని శ్వేత 1,710 ఓట్లు సాధించారు.

అర్బన్‌ బ్యాంక్‌ను అగ్రగామిగా నిలుపుతాం: కర్ర రాజశేఖర్‌

కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో తమ ప్యానెల్‌ను ఆదరించిన ప్రతి ఓటరుకు రుణపడి ఉంటామని కర్ర రాజశేఖర్‌ స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా ప్యానెల్‌ బరిలో నిలిచిందని, చివరికి తాము చేసిన అభివృద్ధే గెలిపించిందని అన్నారు. ప్యానెల్‌కు మద్దతు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గెలుపుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తుది ఫలితాలు ఇలా

మొత్తం ఓటర్లు: 9,287

పోలైన ఓట్లు: 4,114

చెల్లని ఓట్లు: 1,544

జనరల్‌ కేటగిరీలో చెల్లిన ఓట్లు: 3,758

చెల్లని ఓట్లు: 356

ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో చెల్లిన ఓట్లు: 3,220

చెల్లని ఓట్లు: 894

మహిళా విభాగంలో చెల్లిన ఓట్లు: 3,820

చెల్లని ఓట్లు: 294

విజేతలు వీరే

జనరల్‌ కేటగిరీ

అభ్యర్థి సాధించిన ఓట్లు

కర్ర రాజశేఖర్‌ 1,959

బొమ్మరాతి సాయికృష్ణ 1,292

దేశ వేదాద్రి 1,245

కన్న సాయి 1,220

బాశెట్టి కిషన్‌ 1,119

బండి ప్రశాంత్‌దీపక్‌ 1,035

అనురాస్‌ కుమార్‌ 1,015

తాడ వీరారెడ్డి 987

ఉయ్యాల ఆనందం 919

ఎస్సీ, ఎస్టీ

కేటగిరీ

సరిళ్ల

రతన్‌రాజు:

856

కూటమిదే ‘అర్బన్‌’ పీఠం1
1/1

కూటమిదే ‘అర్బన్‌’ పీఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement