 
															తల్లీకొడుకుపై గొడ్డలితో దాడి
● చికిత్స పొందుతూ తల్లి మృతి
శంకరపట్నం(మానకొండూర్): కరీంనగర్ జిల్లాలోని కరీంపేట గ్రామంలో గురువారం తల్లీకొడుకుపై పలువురు గొడ్డలితో దాడి చేయగా.. తల్లి చికిత్స పొందుతూ మృతిచెందింది. కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజుకు భార్య రేణుకతో కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇంట్లోకి భర్త రాజు, అత్త మల్లమ్మ రానివ్వడం లేదని రేణుక పుట్టింటివారు గొడవ పడ్డారు. మల్లమ్మ(65), రాజు(36)పై గొడ్డలితో దాడి చేశారు. మల్లమ్మ చేతి వేళ్లు నరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో.. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి ఘటనాస్థలానికి చేరుకొని ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లమ్మ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
 
							తల్లీకొడుకుపై గొడ్డలితో దాడి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
