డీసీసీ.. ఢీ అంటే ఢీ! | - | Sakshi
Sakshi News home page

డీసీసీ.. ఢీ అంటే ఢీ!

Oct 31 2025 7:34 AM | Updated on Oct 31 2025 7:34 AM

డీసీసీ.. ఢీ అంటే ఢీ!

డీసీసీ.. ఢీ అంటే ఢీ!

మిగిలిన జిల్లాల్లో ఇలా...

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

కాంగ్రెస్‌ పార్టీలో జిల్లా అధ్యక్షుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్‌తోపాటు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. డీసీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు ఈనెల 13 నుంచి 18 వరకు ఆరు రోజులపాటు 33 జిల్లాల్లో పర్యటించిన మాట తెలిసిందే. వివిధ కులాలు, పార్టీ కార్యకర్తలు, డీసీసీ ఆశావహులు మీడియా తదితరులతో చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు తుది జాబితాను కాంగ్రెస్‌ ఢిల్లీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు రూపొందించిన జిల్లా, మండల కమిటీలను డీసీసీలు ఇప్పటికే టీపీసీసీ ఆమోదానికి పంపాయి. వాటిని కూడా త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.

తెరపైకి కరీంనగర్‌ అర్బన్‌ డీసీసీ

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డీసీసీలకు అభ్యర్థులను రూపొందించే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జిల్లాలకు ఒక డీసీసీ అధ్యక్షులుంటారు. జనాభాఅధికంగా ఉన్న వరంగల్‌తోపాటు, కరీంనగర్‌లో కాంగ్రెస్‌ అధిష్టానం అర్బన్‌ డీసీసీలను తెరపైకి తీసుకురానుంది. కరీంనగర్‌లోనూ డీసీసీని అర్బన్‌, రూరల్‌ రెండు డీసీసీలుగా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. కరీంనగర్‌ నియోజకవర్గానికి ప్రత్యేక డీసీసీ ఏర్పాటు కానుందని సమాచారం. దీనికి ఐదు లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ కార్పొరేషన్‌, కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్‌మండలాలు కలిపి అర్బన్‌ డీసీసీగా అవతరించనుంది. అర్బన్‌ డీసీసీ అధ్యక్షుడిగా రేసులో వెలిచాల రాజేందర్‌రావు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఉన్నారు. వీరితోపాటు అంజన్‌కుమార్‌, పద్మాకర్‌రెడ్డి కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. ఇందులో రాజేందర్‌రావు వైపు అధిష్టానం మొగ్గుచూపుతోందని సమాచారం. ఇక రూరల్‌ డీసీసీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఉమ్మడి జిల్లాలోని జగిత్యాలలోనూ డీసీసీ కోసం గట్టి కసరత్తే నడుస్తోంది. గాజంగి నందయ్య, బండా శంకరయ్య, జువ్వాడి నర్సింగరావు, కోమిరెడ్డి విజయ్‌ ఆజాద్‌, సుజిత్‌రావు మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. సిరిసిల్ల జిల్లాలో కేకే మహేందర్‌రెడ్డితోపాటు సంగీతం శ్రీనివాస్‌, గడ్డం నర్సయ్యలు, చక్రధర్‌రెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిలో కేకే మహేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా డీసీసీకి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

కరీంనగర్‌లో తెరపైకి అర్బన్‌ డీసీసీ

ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ

ఢిల్లీకి నివేదిక అందజేసిన ఏఐసీసీ పరిశీలకులు

త్వరలో ఖరారు కానున్న జిల్లా అధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement