 
															రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందేశ్ ఎస్.దేశ్‌పాండే కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు.
బహ్రెయిన్‌లోనే శ్రీపాద నరేశ్ అంత్యక్రియలు..?
మెట్‌పల్లి: ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ దేశానికి వెళ్లిన పట్టణంలోని రాంనగర్‌కు చెందిన శ్రీపాద నరేశ్(39) మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించడానికి అతని కుటుంబ సభ్యుల సమ్మతిని భారత ఎంబసీ కోరింది. 2020 మే 28న అక్కడి ఆసుపత్రిలో నరేష్ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటి నుంచి అక్కడి మార్చురీలోనే అతని మృతదేహాన్ని భద్రపర్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మృతదేహాన్ని అక్కడి నుంచి రప్పించి తమకు అప్పగించాలని 21న హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. రాష్ట్ర అధికారులు అక్కడ భారత ఎంబసీని ఆరా తీయగా.. చనిపోయి చాలాకాలం అయినందున మృతదేహం తరలించడానికి అనుకూలంగా లేదని, ఈ క్రమంలో ఇక్కడే అంత్యక్రియలు జరిపేలా కుటుంబ సభ్యులు తమ సమ్మతిని తెలియజేయాలని కోరారు. దీనికి సానుకూలంగా ఉన్న వారు అంత్యక్రియలకు నరేశ్ సోదరుడు ఆనంద్‌ను పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వం, ప్రవాసీ సంఘాల సాయం కోరుతున్నాడు.
ఏఎల్పీలో కార్మికుడికి అస్వస్థత
రామగిరి(మంథని): ఏపీఏ గనిలో గురువారం పీ షిప్ట్‌లో సింగరేణి కార్మికుడు తోట రవి అస్వస్థతకు గురయ్యాడు. విధుల్లో భాగంగా 86 లెవల్ వద్ద అస్వస్థతకు గురి కాగా గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సెంటినరికాలనీ డీస్పెన్సరీకి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు మెరుగుపరచాలని కార్మికులు కోరుతున్నారు.
మానేరు వాగులో వ్యక్తి అదృశ్యం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చల్లంగుల కృష్ణయ్య(60) అనే వ్యక్తి గురువారం మానేరువాగులో దూకి అదృశ్యమయ్యాడు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు. ఇటీవల కంటికి ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం సరిగా లేకపోగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈక్రమంలోనే గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చిన కృష్ణయ్య సాయంత్రం మానేరువాగులో దూకాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా ఆచూకీ లభించలేదు. కృష్ణయ్య కొడుకు లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గజ ఈతగాళ్లతో గాలింపు చేపడతాం
కృష్ణయ్య అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పడినా ఆచూకీ లభించలేదని తహసీల్దార్ జయంత్ ప్రకటనలో తెలిపారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని, శుక్రవారం తెల్లవారుజాము నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.
 
							రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
 
							రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
