 
															ప్రమాదం మధ్య.. ప్రభుత్వ పాఠశాల
మెట్‌పల్లి: ‘ఓ పక్కన చెరువు, మరో పక్కన పంట పొలాలు.. మధ్యలో పాఠశాల.. దాని చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పాములు తరుచూగా పరిసరాల్లోకి వస్తున్నాయి. రాత్రిపూట మందుబాబులు వరండాల్లో కూర్చోని దర్జాగా మద్యం సేవిస్తున్నారు. ఇది.. మెట్‌పల్లి పట్టణంలోని ఇందిరాప్రియదర్శినీ కాలనీ శివారులో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల దుస్థితి. కొన్నేళ్లుగా పాఠశాలను ఈ సమస్యలు వెంటాడుతున్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు గానీ, ఉన్నతాధికారులు గానీ చొరవ తీసుకోవడం లేదు. తద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● పక్కనే పెద్ద చెరువు.. పంట పొలాలు
● ప్రహరీ లేకపోవడంతో ఆవరణలోకి పాములు
● భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు
 
							ప్రమాదం మధ్య.. ప్రభుత్వ పాఠశాల

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
