కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొడిమ్యాల: మండలకేంద్రంతోపాటు రామకృష్ణాపూర్, నాచుపల్లి, కొండాపూర్, చెప్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ప్రారంభించారు. సత్యం మాట్లాడుతూ.. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డీఆర్డీవో రఘువరన్, సివిల్ సప్లై అధికారులు, మండల ప్రత్యేక అధికారి శ్యాంప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, డైరెక్టర్లు, ప్యాక్స్ చైర్మన్లు రాజా నర్సింగరావు, రవీందర్ రెడ్డి, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో స్వరూప, జ్యోతి, ఏపీఎం ద్యావ మల్లేశం, మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీలు శ్రీనివాస్, వీరకుమార్ పాల్గొన్నారు.


