నిబంధనల ప్రకారం తూకం వేయాలి
మల్లాపూర్: ధాన్యం కొనుగోలు పక్కాగా నిర్వహించాలని జిల్లా సహకార ఆడిట్ అధికారి మాదాసు సత్యనారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ప్యాక్స్ కార్యాలయంలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. రైతులకు సీరియ ల్ నంబర్లు కేటాయించాలని, నిబంధనల ప్రకారం తూకం వేయాలని సూచించారు. సహకార శాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎండీ.నిజాముద్దీన్, ప్యాక్స్ సీఈవోలు పాదం భూమేశ్, బొజ్జ రమేశ్, మామిడి రాజేశ్వర్‌రెడ్డి, కొత్తపల్లి రవితేజ, పండుగ సంపత్ పాల్గొన్నారు.


