‘యూనిటీ మార్చ్’ను విజయవంతం చేయాలి
జగిత్యాల: యువజన క్రీడల మంత్రిత్వశాఖ మై భారత్ జిల్లా పరిపాలన శాఖ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ 150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మార్చ్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ఈనెల 31న జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యూత్ ఆఫీసర్ వెంకట రాంబాబు, డీఎస్పీ వెంకటరమణ, రవికుమార్, ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే
జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. తన కార్యాలయంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. చాలామంది తమను సంతానం పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్నారని, వృద్ధులను విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటకు చెందిన మల్లయ్య, రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన లక్ష్మీబాయి, అంతర్గాంకు చెందిన వెంకవ్వ తమ కుమారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ఏవో రవికాంత్, సీనియర్ సిటిజన్స్ హరి అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
గొల్లపల్లి: రైతులందరూ గాలికుంటువ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రకాశ్ అన్నారు. మండలంలోని చిల్వకోడూరులో శనివారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. పశువుల్లో వచ్చే సీసనల్ వ్యాధులపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 250కి పైగా పశువులకు టీకాలు వేశారు. మండల పశువైద్యాధికారి రవీందర్, సిబ్బంది రవీందర్, రాజశ్రీ, రవి, నిశాంత్, రమేశ్ పాల్గొన్నారు.
పెగడపల్లిలో..
పెగడపల్లి: మండలంలోని రాజారాంపల్లెలో గాలికుంటు నివారణ టీకాల శిబిరాన్ని ప్రకాశ్ సందర్శించారు. వ్యాధి సోకిన పశువులకు టీకాలు వేయించకుంటే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. మండల పశువైద్యాధికారి హేమలత, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయం
మెట్‌పల్లి: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయమని డీఎస్పీ రాములు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ ప్రారంభించారు. సుమారు 50మంది రక్తదానం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాజానికి సేవలు అందిస్తున్నారని తెలిపారు. సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, అనిల్, రాజునాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
‘యూనిటీ మార్చ్’ను విజయవంతం చేయాలి
‘యూనిటీ మార్చ్’ను విజయవంతం చేయాలి
‘యూనిటీ మార్చ్’ను విజయవంతం చేయాలి


