
ముగిసిన పోలీస్ డ్యూటీమీట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా జరిగిన రాజన్న జోన్‌స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇందులో ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని వరంగల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి డ్యూటీమీట్‌కు పంపించనున్నారు. విజేతలకు సీపీ గౌస్ ఆలం పతకాలు అందించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలోని ఫోరెన్సిక్ సైన్స్ రాతపరీక్షలో గంగాధర ఎస్సై వంశీకృష్ణ బంగారుపతకం సాధించారు. క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ చట్టాలు విభాగంలో సిద్దిపేట కమిషనరేట్‌లోని రాయపోల్ ఎస్సై రఘుపతి, మెడికల్ లీగల్ టెస్ట్‌లో చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.ప్రదీప్ కుమార్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పరీక్షలో కామారెడ్డి ఎస్సై ఆంజనేయులు, ఫింగర్ ప్రింట్ సైన్స్‌లో కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఎస్సై యూనస్, క్రైంసీన్ ఫొటోగ్రఫీ పరీక్షలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సై ఆంజనేయులు, పోలీస్ పోట్రైట్ పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రసన్న కుమార్ బంగారు పతకం సాధించారు. యాంటీ సాబెటేజ్ చెక్‌లోని గ్రౌండ్‌సర్చ్‌లో కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుళ్లు వి.సంతోష్, వి.వెంకటేశ్, రూంసెర్చ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.శ్రవణ్ కుమార్, జి.కిరణ్‌కుమార్, వెహికల్‌సెర్చ్‌లో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, ఎం.శంకర్ బంగారు పతకం సాధించారు. యాక్సెస్ కంట్రోల్‌లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.దుర్గాప్రసాద్, కె.సిద్ధిరాములు, డాగ్‌స్క్వాడ్ కాంపిటీషన్‌లోని ట్రాకింగ్‌లో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ జి.శంకర్, నార్కోటిక్ విభాగంలో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ పి.అజయ్, ఎక్స్‌ప్లోజివ్‌లో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన డాగ్ హ్యాండ్లర్ పి.వెంకటేశ్ బంగారు పతకం, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్‌లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఎస్.సతీశ్‌కుమార్, ఆఫీస్ ఆటోమేషన్‌లో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్ యూ.భాస్కర్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ జి.సంతోష్ కుమార్ బంగారు పతకం పొందారు. పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన ఎం.శ్రీధర్‌గౌడ్, వీడియోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్‌కు బంగారు పతకాలు వచ్చాయి. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
విజేతలకు పతకాలు అందించిన సీపీ గౌస్ ఆలం