
మహిళల అభివృద్ధికి స్వయం ఉపాధి యూనిట్లు
జగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తోందని ఏపీఎం గంగాధర్ అన్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లోని స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించారు. సెర్ప్, ఐకేపీ ద్వారా బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి, గ్రామ సంఘాల ద్వారా మహిళా సంఘాల సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి యూనిట్లతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న విధానం, భవిష్యత్ ప్రణాళికలపై సభ్యులకు అవగాహన కల్పించారు. హస్నాబాద్, అంతర్గాం, పొలాస, హైదర్‌పల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో లక్‌పత్‌దీదీ యాప్ నమోదు, ఉల్లాస్ టాస్ నమోదు, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వే పరిశీలించారు. సీసీలు గంగారాం, రవీందర్, శ్రీనివాస్, మండల సమైక్య అధ్యక్షురాలు సత్తవ్వ, వీవోఏలు పాల్గొన్నారు.