
ఎంపిక పోటీలకు వేళాయె!
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వతరగతిలో ప్రవేశాలకు గాను ఎంపిక పోటీల ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి అంకం మండలస్థాయి పోటీలను ముగించుకొని జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులు జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ పాఠశాలలున్నాయి. జిల్లాస్థాయిలో శారీరక, సామర్థ్యానికి సంబంధించిన వాటితోపాటు పలు వాటిల్లో పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయిలో టాప్ 20లో నిలిచిన బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాశాఖల అధికారులు ఎంపిక చేయనున్నారు.
జిల్లాస్థాయి పోటీల వివరాలు
ఈనెల 25, 26ల్లో కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో, 26న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో, 26న జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో, 26న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో జరగనున్నాయి.
రేపటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాపోటీలు
టాప్ 20లో నిలిచిన బాలబాలికలు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు అర్హత
సన్నాహాలు చేస్తున్న జిల్లా క్రీడాశాఖలు
జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలు
– ఎత్తు
– బరువు
– 30 మీటర్ల పైలయింగ్ స్టార్ట్
– స్టాండింగ్ బ్రాడ్ జంప్
– 800 మీటర్ల రన్నింగ్
– 6.10 మీటర్ల షటిల్ రన్
– మెడిసన్ బాల్ త్రో(కిలో బరువు)
– వర్టికల్ జంప్
– ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అండ్ మెడికల్ పరీక్షలు
సువర్ణావకాశం
క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి స్పోర్ట్స్ పాఠశాలలు సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలల్లో చదివి అంతర్జాతీయస్థాయితోపాటు ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొని సత్తా చాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రీడలతోపాటు విద్యపై కూడా శ్రద్ధ చూపుతారు.
– వేల్పుల సురేందర్,
పెటా సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి

ఎంపిక పోటీలకు వేళాయె!