అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా..
జగిత్యాలటౌన్: కార్యకర్తల కృషి, ఆశీర్వాదంతోనే తనకు మంత్రి పదవి దక్కిందని, అందరిలో ఒకడిలా ఉంటూ అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటిసారి జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయనకు మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ముందుగా మంత్రి రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సన్మాన సభలో మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతిఒక్కరూ నిజాయితీతో పనిచేయాలని సూచించారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన జీవన్‌రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా.. విప్‌గా లక్ష్మణ్‌కుమార్ సమర్థవంతంగా పనిచేశారని, మంత్రిగా మరిన్ని సేవలు అందించాలని కోరారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగి కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మంత్రి కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, బండ శంకర్, కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మంత్రి తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. పురోహితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఉద్యోగ, కుల సంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని సన్మానించారు.
అందరి కృషి, ఆశీర్వాదంతోనే మంత్రి పదవి
సన్మాన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


