రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
రాయికల్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.12 ఏళ్ల పాటు సాగు చేస్తునన రైతులు పట్టా పొందేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని భూపంచాయితీలు భూభారతిలో పరిష్కార దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అనంతరం రామాజీపేట గ్రామంలో గంగమ్మతల్లి కల్యాణంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపిరాజరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోయ్యడి మహిపాల్‌రెడ్డి, నాయకులు దివాకర్‌రెడ్డి బాపురపు నర్స య్య, తలారి రాజేశ్, షాకీర్, పొన్నం శ్రీకాంత్, గుమ్మడి సంతోశ్ పాల్గొన్నారు.


