ద్విచక్ర వాహనం దహనం | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం దహనం

Apr 8 2025 7:13 AM | Updated on Apr 8 2025 7:13 AM

ద్విచక్ర వాహనం దహనం

ద్విచక్ర వాహనం దహనం

కోరుట్ల రూరల్‌: మండలంలోని యూసుఫ్‌నగర్‌ గ్రామంలో ఓ యువకుడు తన తాతకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో బైక్‌ పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే మరిపెల్లి లింబయ్య ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి, ఇంట్లో నిద్రించాడు. తన మనవడు మరిపెల్లి లింబాద్రి రాత్రి 10గంటల ప్రాంతంలో మధ్యం సేవించి వచ్చి, ద్విచక్ర వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింబయ్య బయటకు వచ్చే సరికే బైక్‌ పూర్తిగా కాలిపోయింది. లింబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై శ్రీకాంత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం చోరీ

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌లో నిలిపిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బుగ్గారం మండలం మద్దునూర్‌ గ్రామానికి చెందిన గంగిపెల్లి నాగరాజు ఈనెల 1న కొత్తబస్టాండ్‌లో బైక్‌ నిలిపి కళాశాలకు వెళ్లి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మధరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement