జగిత్యాలఅగ్రికల్చర్: వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరఫు న ఆదుకుంటామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఇటీవల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని సోమవారం పరిశీలించారు. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పంట నష్టం వివరాలు సేకరి స్తున్నారని, రైతులు వారికి సహకరించాలని సూ చించారు. పంట నష్టంపై సీఎం, వ్యవసాయమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. లక్ష్మీపూర్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ త్వరలో పూర్తవుతుందన్నారు. రైతు నాయకులు గర్వందుల చిన్న గంగయ్య, ఏలేటి రాజిరెడ్డి, ఎడ్మల సత్తిరెడ్డి, చెరుకు జాన్, పురుపటి రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, నారాయణ రెడ్డి, బాల ముకుందం, ఏఓ తిరుపతి నాయక్, ఏఈఓ హరీశ్ ఉన్నారు.