రోడ్లును ఆక్రమిస్తున్నారు...

- - Sakshi

జగిత్యాల: జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆస్పత్రులు, సూపర్‌మార్కెట్లు, కిరాణాలు, స్కానింగ్‌ సెంటర్లు, వాణిజ్య సంస్థలు అత్యధికంగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా కొత్తబస్టాండ్‌ – టవర్‌సర్కిల్‌ వరకు, తహసీల్‌ చౌరస్తా – జంబిగద్దె వరకు, జంబిగద్దె – అశోక్‌నగర్‌ వరకు, పాతబస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార సముదాయాలు విరివిగా ఉన్నాయి. ఇదేసమయంలో కొందరు తమ దుకాణాల ఎదుట బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పటు చేసుకుంటున్నారు. మరి కొందరు ఏకంగా రోడ్డును ఆక్రమించి ఫ్లెక్సీలు కట్టడం ప్రమాదకరంగా మారుతోంది.

ఇంకొందరు ఏకంగా రోడ్డుపై గుంతలు తవ్వి, పెద్దఇను ప రాడ్లు పాతి, వాటికి ఫ్లెక్సీలు పెడుతున్నారు. దీంతో రహదారి ఆక్రమణకు గురై వాహనాల రా కపోకలకు సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు నడిచేందుకు కూడా స్థలం లేకుండాపోతోంది. కొందరు రేడియం స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాత్రిపూట వాహనాల వెలుతురుకు రిఫ్లెక్షన్‌ అవుతున్నాయి. ఫలితంగా ఎదుటివారు, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ జరుగుతున్నాయి.

పత్తాలేని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు..
● కొందరు వ్యాపారులు రోడ్లను ఆక్రమించి బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

● ఎక్కడైనా అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడితే వెంటనే కూల్చివేస్తున్న అధికారులు.. రహదారులను ఆక్రమించి బోర్డులు ఏర్పాటు చేస్తున్నా, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

● వారి నిర్లక్ష్యంతోనే మున్సిపాలిటీ పరిధిలో అనేకచోట్ల బోర్డులు, ఫ్లెక్సీలు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారని విమర్శలున్నాయి.

● ఇవి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయనే ఆందోళన ఉంది.

● రోడ్డును ఆక్రమించి సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పార్కింగ్‌కు స్థలం లేకుండాపోతోంది.

అసలే ఇరుకై న రోడ్లు..

జిల్లా కేంద్రంలో అసలే ఇరుకై న రోడ్లు ఉన్నాయి. వాటిని ఆక్రమించి బోర్డులు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా ఆస్పత్రులు, ఇతర పనుల కోసం వచ్చే వాహనదారులకు పార్కింగ్‌ స్థలం లేకుండాపోతోంది. కార్లు, జీపులు, ఆటోలు వెళ్లలేని దుస్థితి నెలకొంది.

చర్యలు తీసుకుంటాం
మున్సిపల్‌ పరిధిలోని రోడ్లను ఆనుకుని సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయొద్దు. ఇలాచేస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పార్కింగ్‌కు సైతం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి నోటీసులు జారీచేస్తాం. ప్రతీ వ్యాపారి తన పరిధిలోనే సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలి. రోడ్లను ఆక్రమిస్తే చర్యలు తప్పవు.

– శ్యామ్‌, టీపీఎస్‌, జగిత్యాల

దర్జాగా కబ్జా
కొన్నిరోజులు రోడ్లపై సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు పెడుతున్న కొందరు వ్యాపారులు.. ఆ తర్వాత తమ దుకాణం ఎదుట రోడ్డును ఆక్రమిస్తున్నారు.

మరికొందరు ఏకంగా రేకులషెడ్లు నిర్మిస్తున్నారు.

టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న దుకాణ యజమానులు.. షెటర్లు, భవనాల ఎదుట దర్జాగా రేకుల షెడ్లు నిర్మించి వ్యాపారాలు నడుపుతున్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top