
దాత అజయ్‌ను సన్మానిస్తున్న అర్చకులు
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ మండలం తుంగూర్‌లోని సుమారు 500ఏళ్లక్రితం నాటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు గ్రా మస్తుడు ఓగుల అజయ్ రూ.30 లక్షలు విరాళంగా అందజేశా రు. దీంతో జీర్ణోద్ధరణ పనులను ఆదివారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న అర్చకులు.. ప్రధాన ఆలయంలోని స్వామి వారి ఉత్సవ విగ్రహాలన్ని మరోచోట ప్రతిష్ఠాప న చేశారు. మూడు రోజులపాటు చేపట్టే పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం దాత అజయ్‌ను సర్పంచ్ గుడిసె శ్రీమతి, ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరి, ఉపసర్పంచ్ పూడూరి ర మేశ్, కో ఆప్షన్ సభ్యుడు ఎం.బీబా, మాజీ జెడ్పీ టీసీ శంకర్, గ్రామస్తులు అభినందించారు.