
జగిత్యాల: పంచాంగ శ్రవణం గావిస్తున్న వేద పండితులు
కొండగట్టు : పంచాంగ శ్రవణం చేస్తున్న ప్రధాన అర్చకులు
జగిత్యాలజోన్: పచ్చడి పంపిణీ చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత తదితరులు
జగిత్యాల/జగిత్యాలజోన్/ కొండగట్టు: తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ(ఉగాది) సంవత్సరం సందర్భంగా జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. ఉదయమే ఇళ్లలో ప్రత్యేక పూజలుచేసిన భక్తులు.. ఆ తర్వాత సమీప ఆలయాలను దర్శించుకున్నారు. కొత్త సంవత్సరంలో తమ కుటుంబాలను చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. సాయంత్రం వేళ వేదపండితులు పంచాంగ శ్రవణం గావించారు. ఉగాది ప్రత్యేకత గురించి వివరించారు. పలువురు ప్రముఖులు షడ్రుచుల పచ్చడి పంపిణీ చేశారు. కవులు సమ్మేళనాలతో మైమరపించారు.

