మహిళా సాధికారత.. 135.6 ఏళ్లు దూరం!

World Economic Forum Released The Global Gender Gap Report 2021 - Sakshi

ఆకాశంలోసగం.. కానీ అవకాశాల్లో మాత్రం ఎంతో దూరం.. ఇక్కడ, అక్కడ అని కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మహిళల పరిస్థితి ఇదే. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వరల్డ్‌ ఎకన­మిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ఇటీవల ‘ప్రపంచ లింగ అసమానత్వ నివేదిక (గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు)–2021’ను విడుదల చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతగా వెనుక­బడ్డారన్న వివరాలను పొందుపర్చింది. ప్రపంచ­వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు అవకా­శాలు పెరుగు­తున్నాయని, కానీ ఈ వేగం చాలదని డబ్ల్యూఈ ఎఫ్‌ స్పష్టం చేసింది. ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. మహిళలు పురుషులతో సమానంగా నిలిచేందుకు ఏకంగా 135.6 ఏళ్లు పడుతుందని పేర్కొంది.
–సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

156 దేశాల్లో.. 4 అంశాలపై
డబ్ల్యూఈఎఫ్‌ ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో మహిళల పరిస్థితిని పరిశీలించింది. ముఖ్యం­గా నాలుగు అంశాల (ఉద్యోగ, ఉపాధి అవకా­శాలు; విద్య; వైద్యం–­ఆరోగ్యం; రాజకీయ సాధికా­రత)­ను పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ కలిపి ఒక శాతానికి స్కోర్‌ను నిర్ణయించింది. ఒకటి వస్తే మహిళల సాధికారత బాగున్నట్టు.. సున్నా స్కోర్‌ వస్తే మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు లెక్కించారు.

భారత్‌ స్థానం140
మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకుగాను భారతదేశం 
62 స్కోర్‌తో 140వ స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది.
దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌ (65వ స్థానం), నేపాల్‌ (106), శ్రీలంక (16), భూటాన్‌ (130) మన దేశం కన్నా ముందుండగా.. పాకిస్తాన్‌ (153) వెనుక నిలిచింది.
2020 నివేదికలో మొత్తం 153 దేశాలకుగాను భారత్‌ 112వ స్థానంలో నిలవగా.. తర్వాతి ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 140వ స్థానానికి పడిపోయింది.

ప్రాంతాల వారీగా మహిళా సాధికారత తీరు(స్కోరు) 

ఊహించలేనంత సంపద!
డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక ప్రకారం.. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే ప్రపంచ ఎకానమీకి అదనంగా సమకూరే మొత్తం ఎంతో తెలుసా?


28 ట్రిలియన్‌ డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,22,66,240 కోట్లు (సులువుగా చెప్పుకోవాలంటే 22.22 కోట్ల కోట్లు అన్నమాట) 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top