WHO Alert Against Use Of Two Indian Cough Syrups Over Uzbekistan 19 Childs Deaths - Sakshi
Sakshi News home page

భారత్‌కు చెందిన ఆ రెండు దగ్గు మందులు వాడకండి.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

Published Thu, Jan 12 2023 12:34 PM

WHO Alert On Two Indian Syrups After Uzbekistan 19 Childs Deaths - Sakshi

చిన్న పిల్లల కోసం భారత్‌లో తయారైన రెండు దగ్గు మందులు(సిరప్స్‌) వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. డాక్-1 మ్యాక్స్‌ సిరప్‌, అంబ్రోనల్‌ సిరప్‌ మందుల్లో విషపూరితమైన ఇథిలీన్‌ ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఈ క్రమంలో చిన్నారులకు ఈ సిరప్స్‌ ఇవ్వకూడదని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి సూచించింది. 

అయితే, గతేడాది డిసెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారులు ఆకస్మికంగా మృతిచెందారు. వారికి మృతికి డాక్-1 మ్యాక్స్‌ సిరప్‌, అంబ్రోనల్‌ దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మారియన్‌ బయోటెక్‌ తయారుచేసిన దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్‌ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. 

దీంతో, అప్రమత్తమైన ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వం.. మందులను ల్యాబ్‌లో పరిశీలించగా వాటిలో విషపూరితాలు ఉన్నట్టు గుర్తించింది. దగ్గు మందులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. అనంతరం, ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో దృష్టికి తీసుకువెళ్లింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్‌ బయోటెక్‌ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్‌లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది. దీంతో, డబ్ల్యూహెచ్‌తో సైతం వీటిని వాడరాదంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో కూడా భారత్‌ చెందిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లల మరణించారు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల వల్లే వారు మృతిచెందినట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీంతో, ఆ ముందులను కూడా వాడరాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement