ఊహించని ట్విస్ట్‌ మైండ్‌బ్లాక్‌ అవడం‌ ఖాయం

 Watch Unexpected Twist In Snake Video Which Was Very Scary - Sakshi

ఒక్క క్షణం తర్వాత ఏం జరగబోతుందనేది ఎవరైనా ఊహించగలరా.. సరదాగా ఒక పామును ఆటపట్టిద్దామనుకున్న వ్యక్తి​కి ఊహించని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గాని.. వీడియో చివర్లో మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. (చదవండి : వైరల్‌ ఫొటో: అమ్మకు సలాం!)

ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక వ్యక్తి కొలనులో ఒక పామును చూస్తాడు. ఆ పాము అతన్ని చూసి నీటిలోకి జారుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ఆ పామును నీటి నుంచి బయటికి తీస్తాడు. దానితో అది బుసలు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇలా సరదాగా ఆ పాముతో కలిసి వ్యక్తి ఆటలాడుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక ఊహించని ట్విస్ట్‌ ఎదురవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక పెద్ద కొండచిలువ పైనుంచి ఆ వ్యక్తి మీదకు వేగంగా దూసుకువస్తుంది.  అంతే ! మైండ్‌ బ్లాక్‌ అయిన ఆ వ్యక్తి చేతిలో ఉన్న పామును వదిలేసి నీటిలోకి పడిపోతాడు. ఆ వెంటే కొండచిలువతో పాటు మరొక పాము కూడా నీటిలోకి వెళ్లిపోతాయి. ఈ థ్రిల్లింగ్‌ సీన్‌లో ఇంతకు ఆ వ్యక్తి బయటపడ్డాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇది పాత వీడియోనే అయినా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top