
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక పోవడంతో దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ తదుపరి తనంతట తానే లేచిన బైడెన్.. బాగానే ఉన్నానని, తనకేం కాలేదని చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతోంది.
Biden just beefed it on his bike in Delaware pic.twitter.com/eYj2oG0tHJ
— Quoth the Raven (@QTRResearch) June 18, 2022
(చదవండి: పార్క్ చేసిని కారులో ఏకంగా 47 పిల్లులు ! ఫోటో వైరల్)