Viral Video: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగిన రష్యా

Viral Video: Russia Disconnecting From International Space Station - Sakshi

Russia detaches: ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతుండడంతో అమెరికా యూరప్‌తో సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. దీంతో పలు అగ్రదేశాలు రష్యా పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అయితే రష్యా మాత్రం తన దూకుడును తగ్గించకుండా అమెరికాకు వరుస హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

అంతటితో ఆగకుండా ప్రస్తుతం అనుకున్నంత పనిచేసేసింది రష్యా ఇప్పడూ. తాను ముందు నుంచి హెచరిస్తున్న విధంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగింది. అంతేకాదు తాను అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగితే ఎదురయ్యే పరిణామాల గురించి రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ అమెరికాను ముందుగానే హెచ్చరించారు కూడా. ఈ మేరకు రష్యా తాను అంతరిక్ష కేంద్రం నుంచి డిస్‌కనెక్ట్‌ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల​ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతేకాదు అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియోని అనూహ్యంగా విడుదల చేసింది.

అయితే 47 సెకన్ల నిడివి గల వీడియోలో రష్యన్ వ్యోమగాములు రష్యన్ హాచ్‌ను లాక్ చేసి, ఫ్లయింగ్ అవుట్‌పోస్ట్ నుంచి దూరంగా జ్వెజ్డా మాడ్యూల్‌లో విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది. మాడ్యూల్ స్టేషన్‌ నివాస గృహాలకు ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. యూఎస్‌ విభాగంలో జపనీస్, యూరోపియన్ ప్రయోగశాలలు ఉన్నాయి. జ్వెజ్డా మాడ్యూల్ మొత్తం అవుట్‌పోస్ట్‌కు స్పేస్ టగ్‌గా కూడా పనిచేస్తుంది.

స్టేషన్‌ను స్పేస్ జంక్ నుండి దూరంగా నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాడ్యూల్‌లోని లైఫ్-సపోర్ట్ సిస్టమ్‌ యూఎస్‌ ల్యాబ్, డెస్టినీ లోపల ఉన్న సిస్టమ్‌తో కలిసి పని చేస్తుంది, ఇది మొత్తం అవుట్‌పోస్ట్‌లో కీలకమైన భాగం. ప్రస్తుతం స్పేస్‌ స్టేషన్‌లో అమెరికన్, రష్యన్, యూరోపియన్ సంతతికి చెందిన ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ఆ స్పేస్‌ స్టేషన్‌ నుంచి రష్యా వైదొలగి ఆ 500 టన్నుల నిర్మాణాన్ని భారత్‌కి, చైనాకి వదిలేసే అవకాశం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో రష్యా ఇప్పటికే చైనా తరహాలో సొంత స్పేస్‌ స్టేషన్‌ కోసం ప్లాన్ చేస్తోంది కూడా.

(చదవండి: మోదీజీ యుద్ధం ఆపమని పుతిన్‌కి చెప్పండి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top