కింగ్‌ చార్లెస్‌ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్‌

Viral Video: Man In UK Collided With King Charles Car While Roller Skating - Sakshi

లండన్‌: బ్రిటన్‌లో రోలర్‌ స్కేటింగ్‌ చేస్తున్న వ్యక్తి కింగ్‌ చార్లెస్‌ కారుని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్ర భయాందోళలనకు గురయ్యాడు. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్‌ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ సమీపంలో రాయల్‌ అశ్వికదళం వైపు రోలర్‌ స్కేట్‌లపై వేగంగా వెళ్తున్న వ్యక్తిని సుమారు ఎనిమిది మంది పోలీసులు అడ్డుకున్నారు.

వాస్తవానికి అతనికి ఎలాంటి దుర్దేశాలు లేవని అధికారుల నిర్థారించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ పోలీసులు మాట్లాడుతూ...రాత్రి 7 గంటల సమయంలో పోలీసు వాహనాలు పార్లమెంట్‌ స్క్వేర్‌లోకి ప్రవేశిస్తుండగా ఒక పాదచారి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు చార్లెస్‌ కార్‌ని దాదాపు ఢీ కొట్టాడని తెలిపారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని తప్పించుకోనివ్వకుండా...నేలపై పడుకోబెట్టి సంకెళ్లు వేశారు. ఆ తర్వాత విచారణలో పోలీసులు ఆ వ్యక్తి ఎలాంటి దురుద్దేశంతో ఈ ఘటనకు పాల్పడలేదని, అనుకోకుండా జరిగిందేనని ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు.. లండన్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top