Viral Video: ‘యూకే ప్రధాని బోరిస్ జాన్సన్’ను ఛేజ్ చేస్తున్న పోలీసులు!

UK PM Boris Johnson Gets Chased By Police: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వలే దుస్తులు ధరించిన వ్యక్తి క్రికెట్ స్టేడియంలోకి పరుగులు పెడుతూ.. వచ్చాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకునేందుకు వెంబండించారు. అతను తెల్లటి విగ్, నీలిరంగు టై, తెల్లచి చోక్కా ధరించి అచ్చం బోరిస్ జాన్సన్ వలే ఉన్నాడు. పైగా అతని చొక్కా వెనకాల 'బోరిస్ 4 నంబర్ 10' అని రాసి ఉంది. ఈ ఘటన ఇటీవలే యూకే ప్రధాని తన సొంత పార్టీ సభ్యుల నుంచే అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాల్సి వచ్చిన సంగతిని గుర్తు చేస్తోంది.
అంతేగాక ఆయన పై పార్టీ గేట్ వ్యవహారం నుంచి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన వంటి రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఈ అవిశ్వాస తీర్మానం గెలిచి హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యారు. ఐతే ఇప్పుడూ ఈ అపరిచిత వ్యక్తి జాన్సన్‌లా దుస్తులు ధరించి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
Boris Johnson being chased by a group of policemen 😂😂😂
📹 @turpinmodernist #ENGvNZ pic.twitter.com/9R7lW2TUu9
— England’s Barmy Army (@TheBarmyArmy) June 25, 2022
(చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...)