Giant Owl:150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం

Viral: Giant Owl Photographed After 150 Years Goes Netizens Shock - Sakshi

ప్రపంచం అధూనీకత, టెక్నాలజీ, అభివృద్ధి అంటూ ముందుకు పోతోంది. ఓ వైపు బాగున్నా మరో వైపు మాత్రం అడవులను నరికేస్తూ, పర్యావరణ నాశనానికి కారణమవుతున్నాం. ఈ నేపథ్యంలో బయోడైవర్శిటీ పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఇప్పటికే పలు రకాల పక్షులు, జంతువులు, ప్రాణుల అంతరిస్తూ వస్తున్నాయి. గతంలోని కొన్ని జాతుల పక్షులు, జంతువులు ప్రస్తుతం లేవు. ఇలాంటి పరిస్థితుల్లో..  తాజాగా ఓ అరుదైన పక్షి కనిపించి ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం దాన్ని ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. 

వివరాల్లోకి వెళితే..150 ఏళ్ల క్రితం క‌నిపించిన ఓ పెద్ద గుడ్లగూబ తాజాగా శాస్తవేత్తల కెమెరా కంటపడింది. అంటే ఆ జాతి పక్షి చివరి సారి 1872లో కనపడగా, ఆ తర్వాత ఇప్పుడే కనిపించింది. షెల్లీ ఈగ‌ల్ జాతికి చెందిన ఈ అరుదైన గుబ్లగూబ వెస్టర్న్‌ ఆఫ్రికాలో ఉంటాయి. ప్రపంచంలోని గుడ్లగూబల కంటే వీటి ఆకారం పెద్దవి. ఇవి మనుషుల కంట పడి సుమారు 100 సంవత్సరాలు దాటడంతో అంత‌రించిపోయాయ‌ని అంతా అనుకున్నారు. అయితే.. అక్టోబ‌ర్ 16న లండ‌న్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ జోసెఫ్ టోబియాస్, సోమర్‌సెట్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ విలియమ్స్ ఈ ప‌క్షిని ఘ‌నాలోని అటెవా అడ‌విలో చూశారు.

ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వెంటనే దాన్ని కెమరాతో క్లిక్‌ మనిపించారు. అయితే వారిద్దరూ ఈ పక్షిని కేవలం 15 సెకన్ల పాటు మాత్రమే చూడగలిగారు. ఆ పక్షి విలక్షణమైన నల్లని కళ్ళు, పసుపు రంగు బిల్ ఆకారంలో పెద్దదిగా ఉంది. ఈ అరుదైన పక్షి కోసం పశ్చిమ లోతట్టు ప్రాంతాలలో సంవత్సరాలుగా వెతుకుతున్నారు. తాజాగా తూర్పు ప్రాంతంలోని రిడ్జ్‌టాప్ అడవులలో దీనిని కనుగొనడం వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు.

చదవండి: Youtuber Pankaj Sharma: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్‌ చేస్తే.. కోట్లు సంపాదిస్తున్నాడు..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top