
వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య కీలకమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేర్కొన్నారు. ఆరు లక్షల మంది చైనా విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. వారికోసం అమెరికా యూనివర్సిటీల తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. చైనా విద్యార్థులు తమ దేశంలో నిక్షేపంగా ఉన్నత చదువులు చదువుకోవచ్చని సూచించారు.
వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చైనాలోని అరుదైన ఖనిజాలు అమెరికాకు సులువుగా లభించేలా చూడాల్సిన బాధ్యత జిన్‌పింగ్ ప్రభుత్వంపై ఉందన్నారు. లేకపోతే చైనా ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్‌లు విధించడానికైనా వెనుకాడబోమని హెచ్చరంచారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతల కారణంగా చైనా విద్యార్థులు నష్టపోవడం తమకు సమ్మతం కాదన్నారు. వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. మరోవైపు చైనా విద్యార్థులకు ట్రంప్ ఆహ్వానం పటకడం పట్ల మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trump claims we’re going to let 600k Chinese students in and that China has paid a lot in tariffs.
No, they actually haven’t. Guess how much CHINA has paid in tariffs. Just guess.
This guy conned so many of you idiot MAGA loyalists and now you’re going to jump through hoops… pic.twitter.com/JAX9l8czSO— JohnBurk (@johnburk39) August 25, 2025