South Korea: కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా.. | South Korea: Nine Expired As Building Collapses On To Bus In Gwangju | Sakshi
Sakshi News home page

South Korea: కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా..

Jun 10 2021 1:50 AM | Updated on Jun 10 2021 11:24 AM

South Korea: Nine Expired As Building Collapses On To Bus In Gwangju - Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జు నగరంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనాన్ని కూలి్చవేస్తుండగా శకలాలు ఓ బస్సుపై పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. కూర్చున్నవారు కూర్చున్నట్లే శవాలుగా మారారు. 8 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. కూలి్చవేస్తున్న ఐదంతస్తుల భవనం పక్క వీధిలోనే ఈ బస్సు నిలిచి ఉంది. భారీ కాంక్రీటు శకలాలు నేరుగా బస్సుపై పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement