అందం హిందోళం.. అధరం తాంబూలం

అందంలో మనకు ఐశ్వర్యరాయ్ ఎలాగో.. ఒంటెల్లో ఇదలాగన్న మాట.. ఖతర్‌లో అటు ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలోనే ఇటు ఈ ఒంటెల అందానికి సంబంధించిన ప్రపంచ కప్ పోటీలూ జరిగాయి.
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందమైన ఆడ ఒంటెలు ఈ పోటీల్లో తమ హొయలను ప్రదర్శించాయి. ఈ చిత్రంలోని ఒంటె.. మొదటి స్థానాన్ని గెలుచుకుని.. రూ.44 లక్షల బహుమతిని గెలుచుకుంది. ఇందులో గెలవడం అంత ఈజీ కాదు.. ముందుగా ఈ ఒంటెలకు వైద్యుల పర్యవేక్షణలో ఎక్స్‌రేలు వంటివి తీస్తారు.
ఎందుకంటే.. అందాన్ని ఇనుమడింపజేయడానికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ ఇంజెక్షన్లు వంటివి వాటికి ఇచ్చారా అన్నది తెలుసుకోవడానికట. సహజ సౌందర్యరాశికే పట్టం కట్టాలన్నది తమ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు.
గత పోటీల్లో వైద్య పరీక్షల్లో పట్టుబడిన 47 ఒంటెలపై అనర్హత వేటు వేశారట. పోటీల్లో భాగంగా.. వాటి చెవులు, ముక్కు.. పెదాలు ఇలా అన్నిటినీ నిశితంగా పరీక్షించి.. జడ్జీలు మార్కులేస్తారు.
Spectators watch a camel beauty contest in Ash-Shahaniyah, Qatar 📸 @reuterspictures pic.twitter.com/0wQ3WCyQBm
— Reuters (@Reuters) November 30, 2022