Mother saves her child just seconds before home's ceiling collapse - Sakshi
Sakshi News home page

నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్‌ వీడియో!

Jul 20 2023 11:41 AM | Updated on Jul 20 2023 12:05 PM

mother ran to save child seconds before home ceiling collapse - Sakshi

ఇంటర్నెట్‌లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో కంబోడియాకు చెందినది. ఒక మహిళ తమ ఇంటి పైకప్పు కూలిపోతున్న సమయంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది ఈ వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కన్నుతిప్పుకోనీయకుండా చేస్తోంది. ఫాక్స్‌ న్యూస్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజధాని నోమ్‌ పెన్హ్‌లో చోటుచేసుకుంది. 

వీడియో ఉన్న కంటెంట్‌ ప్రకారం పిప్‌సర్‌ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని కనిపిస్తుంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెడుతుంది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్‌లో ఉంటాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తల్లి నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కాపాడటంలో ఒక్క క్షణం జాప్యం చేసినా, ఆ పసిపిల్లవాడు ప్రమాదం బారిన పడేవాడని వీడియో చూస్తే తెలుస్తుంది. 

ఈ ప్రమాదంలో పిల్లవాడిన కాపాడిన ఆ తల్లి ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ ఇంటిపై కప్పు మా మీద పడితే మేం చనిపోయేవాళ్లం. అందుకే మేము పరుగుపరుగున వచ్చేశాం అని తెలిపారు. ఇంటి యజమాని మీడియాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు వాటర్‌ ‍ప్రూఫింగ్‌ సరిగా జరగలేదని, ఇప్పుడు కుర్తుస్తున్న భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కుంగిపోయి, పడిపోయిందని తెలిపారు. నిర్మాణం సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. అందుకే ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసేముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించుకోవాలని సూచించారు. 
ఇది కూడా చదవండి: భారత్‌, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్‌ స్నేహం.. గత 31 ఏళ్లుగా..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement