
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) 9 నెలల 14 రోజులపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. సుదీర్ఘకాలం తరువాత ఆమె భూమికి చేరుకోవడంతో ప్రపంచమంతా ఆమెను అభినందిస్తోంది. అచ్చం ఇదే ఉదంతాన్ని పోలిన ఆంగ్ల సినిమా ‘ది మార్టిన్’ 2015లో విడుదలయ్యింది.
ఈ సినిమాలో హీరో అంతరిక్ష ప్రయాణానికి వెళ్లి వ్యోమనౌక(Spaceship)లోని సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోతాడు. దీని తర్వాత కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రం ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం మంచి వసూళ్లను కూడా రాబట్టింది. దర్శకుడు రాడ్లీ స్కాట్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ కావడంతో పాటు పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా- 2016 ఆస్కార్ అవార్డులలో ఏడుకుపైగా టైటిళ్లను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా నామినేషన్లను అందుకుంది. 40కి పైగా అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా కథను డ్రూ గార్ఫీల్డ్, ఆండీ వీర్ రూపొందించారు. మాట్ డామన్, జెస్సికా చస్టెయిన్, క్రిస్టీన్ వింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
‘ది మార్టిన్’(The Martian) సినిమా కథ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రను పోలివుంటుంది. ఈ సినిమా కథలో మార్క్ వాట్నీ అనే వ్యోమగామి తన సిబ్బందితో కలిసి అంతరిక్ష మార్స్ మిషన్‌కు వెళతాడు. అయితే మార్గం మధ్యలో అనుకోని పరిస్థితుల్లో సిబ్బంది నుంచి వేరయిపోతాడు. తరువాత మార్క్ వాట్నీ ఒక గ్రహంపైకి అడుగుపెడతారు. ఈ నేపధ్యంలో మార్క్ వాట్నీ చనిపోయాడని నాసా భావిస్తుంది. అయితే ఆ గ్రహం మీద ఉన్న మార్క్ వాట్నీ తన మనుగడ కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తాడు. ఇలా కొంతకాలం గడిచాక మార్క్ భూమిపైకి దిగడంలో విజయం సాధిస్తాడు. ఈ సినిమా.. ప్రేక్షకులకు అంతరిక్ష ప్రయాణ అనుభూతినిస్తుంది. అంతరిక్ష ప్రపంచంలో సినిమాటిక్ టూర్ చేయాలనుకున్నవారు ఈ సినిమాను చూడవచ్చు.
ఇది కూడా చదవండి: Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్ అయ్యింది: ప్రధాని మోదీ