Live Updates
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు.. అల్టిమేటం
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
హర్మూజ్ జలసంధిని తెరవాలని అల్టిమేటం
హర్మూజ్ జలసంధిని తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు సుంకం చెల్లించే నౌకల్ని వెతికి మరీ అడ్డుకుంటాం
చట్టవిరుద్దంగా ఇరాన్‌కు సుంకం చెల్లించే నౌకలకు సముద్రంలో కష్టాలు తప్పువంటూ ట్వీట్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలి: పాక్
- ఒప్పందం కుదరకుండానే ముగిసిన చర్చలు
- అమెరికా, ఇరాన్‌కు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ విజ్ఞప్తి
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పనిసరిగా పాటించాలని విన్నతి
నెక్ట్స్ ఏం జరుగుతుంది?
ఒప్పందం కుదరకపోవడంతో ఎన్నో సందేహాలు
దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా?
కాల్పుల విరమణ ముగుస్తుందా?
పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం
కాల్పుల విరమణ కొనసాగుతోంది
తదుపరి చర్యలపై స్పష్టత లేదు
చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడుల ప్రమాదం పెరిగింది
హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు, చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది
- గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది
- అణు అంశం రెండు పక్షాల మధ్య ప్రధాన అడ్డంకిగా మిగిలింది
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..
- దక్షిణ లెబనాన్‌లో రాకెట్ లాంచర్‌ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది
- జ్వాయాలో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లాంచర్‌పై రాత్రిపూట దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన.
ట్రంప్ సంచలన ప్రకటన..
- అమెరికా డిమాండ్లను ఇరాన్ తిరస్కరిస్తే నౌకాదళ దిగ్బంధనం విధిస్తామని సూచిస్తూ ట్రంప్ పోస్ట్.
- అటువంటి దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రకటన.
- ఇరాన్ చమురు ఎగుమతులపై ఆధారపడిన చైనా, భారతదేశం వంటి దేశాలపై ఒత్తిడిని పెంచే అవకాశం.
- ఆర్థిక ఒత్తిడి ద్వారా లొంగేలా చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్లాన్.
- వెనిజులాపై ఉపయోగించిన దిగ్బంధన విధానంతో సహా గతంలో అమెరికా తీసుకున్న చర్యలను ఈ వ్యూహం పోలి ఉండే అవకాశం.
అమెరికా డిమాండ్లపై ఇరాన్ సీరియస్..
- అమెరికా డిమాండ్లపై ఇరాన్ సీరియస్..
- పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇస్లామాబాద్‌లో చర్చలు
- అమెరికా డిమాండ్ల కారణంగానే చర్చలు విఫలమయ్యాని ఇరాన్ ప్రభుత్వం మీడియా ప్రకటన.
- తమ ప్రజల జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం 21 గంటల పాటు నిరంతరాయంగా, తీవ్రంగా చర్చలు జరిపింది.
- ఇరాన్ ప్రతినిధి బృందం పలు చొరవలు తీసుకున్నప్పటికీ, అమెరికా అసమంజసమైన డిమాండ్లు చర్చల పురోగతిని అడ్డుకున్నాయి.
- దీంతో చర్చలు ముగిశాయి' అని ఇరాన్ మీడియా పేర్కొంది.
శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధం : నెతన్యాహు
- శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధం : నెతన్యాహు
- లెబనాన్‌తో నిజమైన శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధం
- లెబనాన్‌తో స్థిరమైన శాంతికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నెతన్యాహు ప్రకటన.
- లెబనాన్‌తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని వ్యాఖ్యలు.
- ఈ ఒప్పందం నిజమైనదిగా, తరతరాల పాటు నిలిచేలా ఉండాలని స్పష్టం చేశారు.
చర్చలు విఫలం.. స్పందించిన ఇరాన్
- చర్చలు విఫలం.. ఇరాన్ స్పందన ఇదే..
- అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
- అమెరికా మీతిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం జరగలేదు.
- చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారు.
- హార్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదాస్పద అంశాలు ప్రస్తావించారు.
- ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయి.
పాక్ నుంచి బయలుదేరిన జేడీ వాన్స్ బృందం..
- అమెరికా, ఇరాన్ చర్చలపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్‌కు అమెరికా బెస్ట్ ఆఫర్ ఇచ్చింది.
- అమెరికా ఆఫర్‌ను ఇరాన్ తిరస్కరించింది.
- చర్చలు విఫలం కావడం ఇరాన్‌కే నష్టం కలిగిస్తుందన్నారు.
- అనంతరం, జేడీ వాన్స్ బృందం పాకిస్తాన్ నుంచి అమెరికాకు బయలుదేరింది.
US-Iran Peace Talks | Pakistan: US Vice President JD Vance leaves from Islamabad after the US and Iran failed to reach an agreement.
In a press conference, the US Vice President said, "...The bad news is that we have not reached an agreement. I think that is bad news for Iran… pic.twitter.com/ZAja4R5Jxy— ANI (@ANI) April 12, 2026
అమెరికాపై ఇరాన్ చురకలు..
- ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
- అమెరికా-ఇరాన్ చర్చలపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ
- 'అతిగా' ఉండే డిమాండ్లను అమెరికా విరమించుకుంటేనే పురోగతి సాధ్యమవుతుందని ప్రకటన.
- చట్టవిరుద్ధమైన డిమాండ్లకు అమెరికా దూరంగా ఉండాలని చురకలు.
- అప్పుడే శాంతి చర్చలపై విజయం ఆధారపడి ఉందని వ్యాఖ్యలు.
- ఇరాన్ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలం
- ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం: జేడీ వాన్స్
- మా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు
- ఇరాన్‌తో డీల్ లేదు
- 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
- ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి
ఇరాన్ కీలక ప్రకటన..
- చర్చల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన..
- కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయన్న ఇరాన్.
- ఇంకా కొన్ని సాంకేతిక అంశాలు ఖరారు చేయాల్సి ఉందన్న ఇరాన్.
- చర్చల్లో ఆర్థిక, సైనిక, న్యాయ, అణు కమిటీలు పాల్గొంటాయన్న ఇరాన్
- చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరాయన్న ఇరాన్ ప్రభుత్వం.
ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- తొలిదశ చర్చలు ముగిశాక మీడియాతో కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
- అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు అత్యంత కీలకమైనవి: ట్రంప్
- ఇరాన్‌పై ఇప్పటికే సైనిక విజయం సాధించామని ప్రకటించిన ట్రంప్
- హార్మూజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ట్రంప్.
- ఎలా చూసినా గెలుపు అమెరికాదే అని వ్యాఖ్యానించిన ట్రంప్.
- హార్మూజ్ ఒప్పందం కుదిరినా కుదరకపోయినా, జలసంధిలో మైన్లను తొలగిస్తామన్న ట్రంప్.
- చర్చల్లో ఏం జరుగుతుంది అనేది తనకు అనవసరం అని పేర్కొన్న ట్రంప్.
- ఇరాన్ విషయంలో ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
ముగిసిన అమెరికా, ఇరాన్ చర్చలు..
- ఇస్లామాబాద్‌లో ముగిసిన అమెరికా, ఇరాన్ చర్చలు.
- 14 గంటల పాటు జరిగిన చర్చలు.
- చర్చల్లో పాల్గొన్న ఇరు దేశాల సాంకేతిక బృందాలు.
- పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంలో జరిగిన చర్చలు.
- కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై సాగిన చర్చలు
- 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరపడం ఇదే తొలిసారి.


